శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (12:54 IST)

జబర్దస్త్ కమెడియన్ అవినాష్ చీటింగ్ చేశాడు.. అడ్వాన్స్ తీసుకుని డుమ్మా కొట్టాడట..?

జబర్దస్త్ స్టార్లకు యమా క్రేజ్. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనే యాక్టర్లకు విపరీతమైన ఫాలోయింగ్‌ వస్తుంది. అలాంటి కమెడియన్‌లలో ఒకరు ముక్కు అవినాష్‌. కేవలం జబర్దస్త్‌ కారణంగా ఫేమస్‌ అయిన ముక్కు అవినాష్‌కు ఇటీవ

జబర్దస్త్ స్టార్లకు యమా క్రేజ్. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనే యాక్టర్లకు విపరీతమైన ఫాలోయింగ్‌ వస్తుంది. అలాంటి కమెడియన్‌లలో ఒకరు ముక్కు అవినాష్‌. కేవలం జబర్దస్త్‌ కారణంగా ఫేమస్‌ అయిన ముక్కు అవినాష్‌కు ఇటీవల సినిమాల్లో మరియు స్టేజ్‌ షోలపై ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

వచ్చిన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రైవేట్‌ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే శివరాత్రి సందర్భంగా ఒక లైవ్‌ షోను చేసేందుకు వేణుగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.10 వేల రూపాయల అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాడు. 
 
అడ్వాన్స్‌ తీసుకుని అగ్రిమెంట్‌ రాసుకున్న తర్వాత ముక్కు అవినాష్‌ కార్యక్రమానికి రాకుండా డుమ్మా కొట్టాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. వేణుగోపాల్ రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అవినాష్‌పై చీటింగ్‌ కేసు పెట్టాడు. తన వద్ద అడ్వాన్స్‌ తీసుకుని కార్యక్రమానికి రాకుండా అవినాష్‌ చీటింగ్‌కు పాల్పడ్డాడు అంటూ వేణుగోపాల్‌ రెడ్డి చెప్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అవినాష్ వద్ద విచారణ చేపట్టనున్నారు.