శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (12:04 IST)

జీవిత కార్యదర్శులపై కేసు ... 'బతుకు జట్కాబండి'కి రమ్మని బెదిరింపులు

సినీ నటి జీవిత కార్యదర్శులపై కేసు నమోదైంది. ఆమె సారథ్యంలో నిర్వహిస్తున్న 'బతుకు జట్కాబండి'కి రమ్మని బెదిరింపులకు పాల్పడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు కేసు నమోదుచేశారు.

సినీ నటి జీవిత కార్యదర్శులపై కేసు నమోదైంది. ఆమె సారథ్యంలో నిర్వహిస్తున్న 'బతుకు జట్కాబండి'కి రమ్మని బెదిరింపులకు పాల్పడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటో డ్రైవర్‌. 2005వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జ్యోతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె సంపూర్ణ(9). రెండో కాన్పులో జ్యోతికి టీబీ వ్యాధి రావడంతో బాబుపుట్టి చనిపోయాడు. అనారోగ్యంగా ఉన్న జ్యోతి తల్లిగారింటివద్ద ఉంటోంది. 
 
గ్రామ పెద్దల సమక్షంలో భార్యాభర్తలు సంతకాలు చేసుకుని విడిపోయారు. జ్యోతికి కొండ లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇటీవల జ్యోతి బతుకు జట్కాబండి కార్యక్రమ నిర్వాహకురాలు జీవిత రాజశేఖర్‌ను ఆశ్రయించింది. దీంతో జీవిత వ్యక్తిగత కార్యదర్శులు కిరణ్‌, మరో మహిళ.. కొండ అతని తమ్ముడికి ఫోన్లుచేసి బెదిరించడం ప్రారంభించారు. వారి మాటలను రికార్డు చేసి కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.