శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (09:02 IST)

టాలీవుడ్ సినీ రచయితపై వేధింపుల కేసు!

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ రచయితపై కేసు నమోదైంది. భార్యను వేధించినందుకుగాను మూవీ రైటర్ యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో వేధింపుల కేసు నమోదైంది.  
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసించే యర్రంశెట్టి రమణ ‌గౌతమ్ అదే ప్రాంతానికి చెందిన యువతి (24)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 
అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపడంతో గతేడాది జూన్‌లో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తిరిగి కలిసి ఉండేందుకు అంగీకరించారు.
 
ఈ క్రమలో గత కొంతకాలంగా రమణ గౌతమ్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అదేసమయంలో భార్యకు ఫోన్లు చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానని బెదిరిస్తుండడంతో యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆయనపై కేసు నమోదు చేశారు.