శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (15:14 IST)

కేఏ పాల్ కోడలి ఫిర్యాదుతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మ దర్శకత్వం వహించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా డిసెంబర్ 12న విడుదలకానుంది. ఈ సినిమాకు ఏపీ హైకోర్టు, సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. దీంతో సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 
అయితే, రాంగోపాల్ వర్మ తాజాగా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కేఏ పాల్.. రాంగోపాల్ వర్మ సర్టిఫికెట్ ఇస్తున్నట్లుగా ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయంపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తాము దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని, రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని జ్యోతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.