క్యూట్ లవ్ స్టోరితో ఛలో ప్రేమిద్దాం
ఉదయ్ కిరణ్, బెక్కం వేణుగోపాల్, సురేష్ శేఖర్ రేపల్లె, సాయి రోనక్, నేహ సోలంకి
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 19న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ,``ట్రైలర్ కు పాటలకు మంచి ఆదరణ లభిసో్తంది. క్యూట్ లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. సురేష్ సినిమాను చాలా కొత్తగా తీసే ప్రయత్నం చేశారు. ఆల్ ఎమోషన్స్ ఉన్న కమర్షియల్ సినిమా కాబట్టి కచ్చితంగా థియేటర్ లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. అన్నారు.
హీరోయిన్ నేహ సోలంకి మాట్లాడుతూ, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నా క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు డైరక్టర్ సురేష్ గారు. మా సినిమాకు ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి `` అన్నారు.
లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ, ఇందులో నేను రెండు పాటలు రాశాను. డైరక్టర్ గారు నాతో ఫీల్ గుడ్ సాంగ్స్ రాయించారు. నా అక్షరాలని నమ్మి నిర్మాత లక్షలు ఖర్చు పెట్టారు. సినిమా చూశాం చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు నచ్చుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ..``ట్రైలర్, పాటలు చాలా బావున్నాయి. దర్శక నిర్మాతలతో నాకు మంచి పరిచయం ఉంది. సాయి రోనక్, నేహ సోలంకి జంట బావుంది. ట్రైలర్ చూస్తుంటే కలర్ ఫుల్ గా ఉంది. ఈ నెల 19న విడుదలవుతోన్న ఈ చిత్రం ఘన విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలు, యూనిట్ అందరికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా`` అన్నారు.
నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, `మా బేనర్ లో వస్తోన్న మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. పాటలకు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 19న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా`` అన్నారు.
దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ, ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే మా హీరో హీరోయన్స్ అద్భుమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ అన్నీ బాగా కుదిరాయి. ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా వర్క్ చేశారు. లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. దర్శకుడుగా నా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా`` అన్నారు.
మరో లిరిసిస్ట్ దేవ్ పవార్ మాట్లాడుతూ...``ఈ సినిమాలో రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ రాశాను. నన్ను నమ్మి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధ్యాంక్స్ `` అన్నారు.
కొరియోగ్రాఫర్ వెంకట్ దీప్ మాట్లాడుతూ...``ఫస్ట్ నాతో డైరక్టర్ గారు ఒక పాట కంపోజ్ చేయించారు. అది నచ్చి అన్ని పాటలను కంపోజ్ చేసే అవకాశం కల్పించారు`` అన్నారు.