శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (10:58 IST)

నా తొలి సినిమా నిర్మాత గుర్తొచ్చారుః గోపించంద్ మ‌లినేని

Suresh Shekhar Repalle, Gopinchand Malineni, Uday Kiran ohters
సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`. ఉద‌య్ కిర‌ణ్ నిర్మాత‌. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ ను ద‌ర్శ‌కుడు గోపించంద్ మ‌లినేని ఆవిష్క‌రించారు. 
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ,``ఓ రోజు డైర‌క్ట‌ర్ సురేష్ వ‌చ్చి మోష‌న్ పోస్ట‌ర్ చూపించారు. మోష‌న్ పోస్ట‌ర్  న‌చ్చడంతో లాంచింగ్ కి వ‌చ్చాను. అంద‌రూ ప్రొడ్యూస‌ర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంక‌ట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఒక కొత్త డైర‌క్ట‌ర్ కి ఎంత స‌పోర్ట్ చేయాలో అంత స‌పోర్ట్ చేశారు. అలా ఛ‌లో ప్రేమిద్దాం నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ గారు ఇచ్చిన మాట కోసం సురేష్‌కి సినిమా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న ఉద‌య్ కిర‌ణ్ గారు క‌చ్చితంగా గొప్ప నిర్మాత‌గా ఎదుగుతారు. 
 
ఇక ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ చూశాక విజువ‌ల్ ట్రీట్ లా సినిమా ఉండ‌బోతుంద‌ని అర్థమ‌వుతోంది. అంతా యంగ్ టీమ్ ప‌ని చేశారు.  భీమ్స్ ఎప్ప‌టిలాగే ఈ సినిమాకు కూడా  మంచి పాట‌లు ఇచ్చార‌నుకుంటున్నా.  యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
 
మ‌రో అతిథి బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ,``నిర్మాత నాకు మంచి మిత్రుడు. సినిమాల ప‌ట్ల ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌. అలాగే ద‌ర్శ‌కుడు సురేష్ కూడా చాలా కాలంగా ప‌రిచ‌యం. ఎంతో ప్ర‌తిభావంతుడు. మోష‌న్ పోస్ట‌ర్ గ్రాండ్ గా ఉంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. భీమ్స్ పాట‌లు అద్భుతంగా వ‌చ్చాయి అన్నారు.
 
చిత్ర నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ,  సినిమా మొత్తం పూర్త‌యింది. నవంబ‌ర్ నెలాఖ‌రులో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం  అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె మాట్లాడుతూ,  ఇచ్చిన మాట కోసం పాండమిక్ లోనూ వెన‌కాడకుండా సినిమాకు ఖ‌ర్చు పెట్టారు మా నిర్మాత‌. అలాగే హీరో, హీరోయిన్స్ ఎంతో స‌పోర్ట్ చేశారు. సాయి రోన‌క్ పెద్ద హీరో అవుతాడు. శ‌శాంక్ చాలా మంచి పాత్ర పోషించాడు. ఆయ‌న స‌హ‌కారం మ‌రువ‌లేనిది.  భీమ్స్ పాట‌లతో  పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. మా టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. త్వ‌ర‌లో పాట‌లు రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.
 
డాన్స్ మాస్ట‌ర్ వెంక‌ట్  దీప్ మాట్లాడుతూ, అప్ క‌మింగ్ మాస్ట‌ర్ కి ఒక్క సాంగ్ ఇవ్వ‌డ‌మే క‌ష్టం. అలాంటిది ఈ సినిమాలో సింగిల్ కార్డ్ ఇచ్చారు. న‌న్ను న‌మ్మి ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, నేప‌థ్య సంగీతం భీమ్స్ చేయ‌గ‌ల‌డా అంటూ అంద‌రూ అనుకునే వారు. ఆ అపోహ కూడా ఈ సినిమాతో పోతుంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను చాలా రిచ్  గా తీసారు. సురేష్ గంగుల‌, దేవ్ మంచి లిరిక్స్ రాశారు`` అన్నారు.
 
హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ,యాక్ష‌న్ ఎపిసోడ్స్ చాలా గ్రాండ్ గా తీశారు. భీమ్స్ గారు పాట‌లు, నేప‌థ్య సంగీతం బాగా కుదిరాయి. ఇటీవ‌ల సినిమా చూశాను  చాలా బాగా వ‌చ్చింది. యాక్ష‌న్‌, ల‌వ్‌, కామెడీ, ఫ‌న్ , స‌స్పెన్స్ అన్నీ ఎలిమెంట్స్ మా సినిమాలో ఉన్నాయ‌న్నారు.
 
న‌టుడు శ‌శాంక్ మాట్లాడుతూ...``న‌న్ను ఈ సినిమాలో సురేష్ గారు డిఫ‌రెంట్ గా చూపించారు. క‌చ్చితంగా నాకు ఈ సినిమా ప్ల‌స్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.
 
పాట‌ల ర‌చ‌యిత సురేష్ గంగుల మాట్లాడుతూ, భీమ్స్  గారు ఎప్ప‌టిలాగే ఈ సినిమాలో మంచి పాట‌లు రాసే అవ‌కాశం ఇచ్చారు. డైర‌క్ట‌ర్ మంచి లిరిక్స్ నాతో రాయించుకున్నారు. ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ధన్య‌వాదాలు తెలిపారు.
 
మ‌రో పాట‌ల ర‌చ‌యిత దేవ్ మాట్లాడుతూ., భీమ్స్ గారు అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న్ను నమ్మి సురేష్ గారు నాకు రెండు పాట‌లు రాసే అవ‌కాశం క‌ల్పించారు`` అన్నారు.
 డాన్స్ మాస్ట‌ర్ వెంక‌ట్  దీప్ మాట్లాడుతూ...```అప్ క‌మింగ్ మాస్ట‌ర్ కి ఒక్క సాంగ్ ఇవ్వ‌డ‌మే క‌ష్టం. అలాంటిది ఈ సినిమాలో సింగిల్ కార్డ్ ఇచ్చారు. న‌న్ను న‌మ్మి ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు`` అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో\  శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌,  హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ;  పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు;  పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు,  ఫైట్స్ః న‌భా-సుబ్బు, కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌;  సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి;  నిర్మాతః  ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె.