బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (20:24 IST)

బ్రో- లో అన్నా చెల్లి లుక్ విడుదల చేసిన రష్మిక మందన

Avika-Naveen
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెలుగా నటిస్తున్న చిత్రం `బ్రో` (BRO). మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జెజెఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.జె.ఆర్. రవిచంద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ తుపురాణి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇంకా సంజన సారథి, సాయి రోనక్ న‌టిస్తున్నారు. నవీన్ చంద్ర, అవికాగోర్ ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ఆదివారంనాడు విడుదల చేసింది. 
 
ఈ సందర్భంగా నిర్మాత జె.జె.ఆర్ రవిచంద్ మాట్లాడుతూ, రష్మిక మందన విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే నవీన్ చంద్ర, అవికాగోర్ లుక్ చూసి చాలమంది స్టోరీ ఎంటని ఫోన్స్ చేస్తున్నారు. ఈ స్టోరీలో అన్న, చెల్లెలుగా నటిస్తున్నారు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ చిత్రం, అన్నయ్య చెల్లెలు మధ్య జరిగే ఓ మంచి ఎమోషనల్ ఫాంటసీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎంతో క్యూరియాసిటీగా డీఫ్రెంట్ గా ఉంటుంది. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ లో నటించే అవికాగోర్ నవీనచంద్ర కు చెల్లెలుగా నటించడానికి ఒప్పుకోవడం.అలాగే ఎన్నోమంచి మంచి హిట్లు ఇచ్చిన నవీన్ చంద్ర హీరోయిన్ కు అన్న క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. హీరో,హీరోయిన్ గా చేసే  వీరిద్దరూ అన్న ,చెల్లెలుగా నటించడానికి ఒప్పుకున్నారంటే ఈ కథ ఎంత బలమైందో మీకే అర్థమవుతుంది.
 
ఈ చిత్రాన్ని వైజాగ్ తదితర అందమైన ప్రదేశాలలో షూట్ చేయడం జరిగింది. మంచి విజువల్స్ మరియు మ్యూజిక్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామని అన్నారు.