సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:02 IST)

సినీ నటి భావన కిడ్నాప్ కేసు.. ఏడుమందిపై ఛార్జీషీట్ దాఖలు

సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడు మందిపై పోలీసులు కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. భావనను రెండు నెలల క్రితం కారులో కిడ్నాప్‌కు గురైన సంగతి

సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడు మందిపై పోలీసులు కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. భావనను రెండు నెలల క్రితం కారులో కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుమందిపై ఛార్జీషీట్‌ దాఖలు చేసినట్లు డీఎస్పీ బాబు కుమార్ తెలిపారు. ఇందులో పల్సర్ సునీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
భావన కారులో వెళ్తున్న విషయాన్ని పల్సర్ సునీల్‌కు సమాచారం ఇచ్చిన డ్రైవర్ మార్టిన్ ఆంటోనీతో పాటు సలీమ్, ప్రదీప్ విజీస్, మణికంఠన్‌లతో  పాటు ఛార్లీ థామస్‌లపై ఛార్జీషీట్ దాఖలైంది. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వ్యూహాలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 
 
ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరికొందరికి కూడా సంబంధం ఉన్నట్లు సమాచారం. 90 రోజుల్లోపు ఛార్జీషీట్ దాఖలు చేయని పక్షంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉందనే కారణంతో ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేసినట్లు డీఎస్పీ బాబు కుమార్ తెలిపారు.