ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (08:01 IST)

చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

Venkat Kalyan, Gayatri
Venkat Kalyan, Gayatri
అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్,  శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో  సిహెచ్ క్రాంతి కిరణ్  నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్  దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది
 
ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తిన్నాము. సినిమా బాగా వచ్చింది..అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీలో ఉన్నాయి. తప్పకుండా ఆకట్టుకుంటుంది టైటిల్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్,  టీజర్ ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్ ను హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ ట్రైలర్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. మా తోలి ప్రయత్నం ను ఆశీర్వదించండి అని అన్నారు.