1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:38 IST)

అంజలా ఝవేరి భర్తతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫైటింగ్....

ప్రేమించుకుందా రా చిత్రం పేరు చెబితే ఆ చిత్రంలో నటించిన సెక్సీ నటి అంజలా ఝవేరీ గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆ నటి మళ్లీ ప్రచారంలోకి వస్తోంది. కాకపోతే ఆమె నటించడంలేదు కానీ ఆమె భర్త లైన్లోకి వచ్చాడు. విషయం ఏంటయా అంటే, అ

ప్రేమించుకుందా రా చిత్రం పేరు చెబితే ఆ చిత్రంలో నటించిన సెక్సీ నటి అంజలా ఝవేరీ గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆ నటి మళ్లీ ప్రచారంలోకి వస్తోంది. కాకపోతే ఆమె నటించడంలేదు కానీ ఆమె భర్త లైన్లోకి వచ్చాడు. విషయం ఏంటయా అంటే, అంజలా ఝవేరీ భర్త మోడల్ రంగం నుంచి నటుడిగా స్థిరపడ్డ తరుణ్ అరోరా చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రంలో విలన్‌గా నటిస్తున్నడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రంలో కూడా ఈయనే విలన్‌గా నటించడం విశేషం. 
 
కాగా తరుణ్ అరోరాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దపెద్ద అవకాశాలయితే రాలేదు. కానీ చిరంజీవి ఖైదీ నెం.150, పవన్ కళ్యామ్ కాటమరాయుడు చిత్రాలతో మంచి గుర్తింపు వస్తుందనీ, తద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పాగా వేయవచ్చని ఆశ పడుతున్నాడు. మరి అంజనా ఝవేరి భర్త లక్ ఎలా ఉందో చూడాలి.