చిరంజీవి పరిస్థితి ఇలా అయ్యిందేమిటి..? నయన, అనుష్క కూడా వద్దన్నారా?!
మెగాస్టార్ చిరంజీవి కత్తిలాంటోడుకు.. హీరోయిన్ లేకపోవడంతో సినిమా డిలే అవుతున్నట్లు ఫిలిమ్ వర్గాల సమాచారం. మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీకి తర్వాత తన 150వ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం తమిళంలో బంపర్ హిట్ అయిన కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాణ సారథ్యం వహిస్తుండగా, వినాయక్ దర్శకత్వ పగ్గాలు చేపట్టారు. ఇంకా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇందుకు కారణం హీరోయిన్ దొరకకపోవడమేనని సినీ వర్గాల్లో టాక్.
మొన్నటివరకు చిరంజీవితో అనుష్క నటించనుందనే టాక్ వినిపించింది. ప్రస్తుతం అనుష్క భాగమతిపై చిరు సినిమాకు నో చెప్పిందని టాక్. అంతకుముందు నయనతార కూడా చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆమె కూడా చిరు సరసన నటించట్లేదని తేల్చేసింది. అనుష్క, నయనతారలు డేట్స్ కుదరకపోవడంతో చిరు సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో అన్నయ్య సినిమా డిలే అవుతుంది. మరి చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.