1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (15:02 IST)

చిరంజీవి పుట్టినరోజు.. "ఖైదీ నెంబర్ 150'' ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫ్యాన్స్ పండగ (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని... చిరు 150వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళ కత్తి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాకు ఇప్పటికే "ఖైదీ నెంబర్ 150'' అ

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని... చిరు 150వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళ కత్తి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాకు ఇప్పటికే "ఖైదీ నెంబర్ 150'' అనే పేరును ఖరారు చేసిన నేపథ్యంలో.. ఆయన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 150వ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల  చేశారు. 
 
సోమవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. ఈ మోషన్‌ పోస్టర్‌లో చిరంజీవి లుక్‌ను మొత్తంగా విడుదల చేయలేదు. బ్యాగ్రౌండ్‌లో దేవిశ్రీ  ప్రసాద్‌ బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ పాడిన పాట కూడా వస్తుంది. 
 
ఈ ఫస్ట్ లుక్‌తో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మగధీర రామ్ చరణ్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.