గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (17:25 IST)

లాస్ ఏంజిల్స్ లో వేడుకల్లో బిజీగా వున్న చిరంజీవి, వెంకటేష్

chiru, venky family - Los Angeles
chiru, venky family - Los Angeles
ఇటీవలే లాస్ ఏంజిల్స్ కు వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గారు పలు కార్యక్రమాలలో బిజీగా వున్నారు. అయితే వారితోపాటు విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ కూడా వెళ్ళారు. ప్రచారానికి దూరంగా వుండే వెంకటేష్ ఈరోజు చిరంజీవి కుటుంబంతోపాటు తమ కుటుంబం కూడా ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఫొటోలు షేర్ చేశారు. 
 
Chiranjeevi, Venkatesh, venkatesh, Kumar Koneru, kl narayana, allu aravind
Chiranjeevi, Venkatesh, venkatesh, Kumar Koneru, kl narayana, allu aravind
మెగాస్టార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలుపుతూ, మా ప్రియమైన మిత్రుడు కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు మరియు శైల్య శ్రీల వివాహ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. కొత్త జంటను ఆశీర్వదించాం మా సంతోషం రెట్టింపు అయింది. మాతో పాటు వెంకీమామ చేరారు అని పేర్కొన్నారు.  ఈ వేడుకలో అల్లు అరవింద్ కుటుంబం, నిర్మాత కె.ఎల్. నారాయణ తదితరులు వున్నారు.
 
ఎన్అర్ఐ కుమార్ కోనేరు నిర్మాత కూడా. గతంలో నాగచైతన్యతో బెజవాడ, రవితేజతో  దొంగల ముఠా,  జగపతి బాబు, జెడి. చక్రవర్తితో  అండర్ వరల్డ్ బాస్ వంటి సినిమాలు తీశారు.