గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (11:48 IST)

తాప్సీ పన్నును బుక్ చేసుకున్న చిరంజీవి

Niranjan Reddy, Tapsi Pannu, Chiranjeevi
నిజ‌మేనండి. తాప్సీ పన్నును  చిరంజీవి బుక్ చేసుకున్నాడు. ఇది సినిమా భాష‌. మెగాస్టార్ చిరంజీవితో సైరాలో ఓ పాత్ర‌ను త‌మ‌న్నా భాటియా పోషించింది. అది ఆయ‌న కోసం త్యాగం చేసే పాత్ర‌. పాత్ర నిడివి త‌క్కువే. ఆ త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవితో హీరోయిన్‌గా న‌టించే కోరిక తీర‌లేదు. `సైరా`లో అర్థంత‌రంగా ముగిసింది నా పాత్ర అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. క‌ట్‌చేస్తే, ఇప్పుడు చిరంజీవితో త‌మ‌న్నా ఓ సినిమాలో న‌టిస్తోంది. అలాగే హీరోల‌కు కోరిక వుంటుంది. అలా మెగాస్టార్ చిరంజీవికి త‌న కోరిక వ్య‌క్తం చేశారు.
తాప్సీ ఝుమ్మంది నాదం సినిమా చేసింది. సినిమా రిలీజ్ వేడుక‌కు హాజ‌ర‌య్యాను. అప్పుడు  చాలా క్యూట్‌గా వుంది. ఆమెతో సినిమా చేయాల‌నుకున్నా. కానీ ఆ టైంలో నేను రాజ‌కీయాల్లోకి వెళ్ళిపోయాను. అందుకే ఆమెతో న‌టించ‌లేక‌పోయాను. కానీ ఇప్పుడు తాప్సీతో మెయిన్ లీడ్ చేయాల‌నుంద‌ని మ‌న‌ర‌సులోని కోరిక వ్య‌క్తం చేశాడు. ఇందుకు సార‌ధిగా `ఆచార్య‌` సినిమా  నిర్మాత‌ నిరంజ‌న్‌రెడ్డి వున్నారు. చిరంజీవి నిర్మాత‌కు చెబుతూ, ఆమెతో మెయిన్ కాంబినేష‌న్‌గా మా ఇద్ద‌రినీ క‌లిపే క‌థ చూడండి అని వెల్ల‌డించారు.
 
అదే విధంగా తాప్సీకి చిన్న స‌జెన్ చేశాడు. న‌న్ను డామినేట్ చేయ‌కూడ‌దు.  పింక్ సినిమాలో అమితాబ్‌ను డామినేట్ చేస్తే నేను ఒప్పుకోను. నేనేకాదు యాంక‌ర్ సుమ కూడా ఒప్పుకోద‌ని లిటికేష‌న్ పెట్టాడు. అందుకే తాప్సీ న‌వ్వుతోనే స‌మాధాన చెప్పింది. పాన్ ఇండియా హీరోయిన్ అయిన తాప్సీ చిరంజీవి చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంది. ఏది ఏమైనా ఒక భారీ సినిమాకు భారీ పారితోషికం తాప్సీ తీసుకోబోతున్న‌ద‌న్న‌మాట‌. ఎందుకంటే చిరంజీవి ఆమెను అడిగాడు కాబ‌ట్టి. ద‌టీజ్‌.. చిరంజీవి, తాప్సీ బుకింగ్ స్టోరీ.