శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , బుధవారం, 12 జులై 2017 (08:08 IST)

చిరు 'నయనే'నట.. ఆగస్టు 15న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంచింగ్ డేట్..

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న లాంచ్ చేయడానికి కొనిదె

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత చిరు హీరోగా నిర్మించిన 'ఖైదీ నెంబర్ 150' సంచలన విజయం సాధించింది. సంవత్సర కాలంగా ఊరిస్తూ వస్తున్న చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న లాంచ్ చేయడానికి కొనిదెల ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
 
స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించిన అధిక భాగం షూటింగ్ ఉత్తర భారత దేశంలో జరగనున్నట్టు తెలుస్తోంది. అగస్టు 15 తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరగనున్న ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇంకా ఒక నిర్ధారణకు రానప్పటికీ దక్షిణాది అగ్రహీరోయిన్లలో ఒకరైన నయనతార ఈ సినిమాకు సైన్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయిక కోసం చాలా కాలంగా అన్వేషణ సాగుతోంది. ఇప్పుడు ఆ స్థానం దాదాపుగా నయనతారకు ఖరారైపోయినట్టు సమాచారం. ఇటీవల చిత్రబృందం నయనను సంప్రదించడం, ఆమె ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. చిరు - నయన జోడీ కట్టడం ఇదే తొలిసారి. 
 
స్టయిలిష్ డైరెక్టర్ సురేదర్‌రెడ్డి దర్శకత్వంలో చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా హీరోయిన్‌ ఎవరనే విషయంపై  క్లారిటీ రాలేదు. ఇంతవరకూ ఐశ్వర్యరాయ్, అనుష్క పేర్లు తెరపైకి వచ్చినా వాళ్లిద్దరూ కన్ఫర్మ్ అవలేదు. అయితే తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోల సరసన మెప్పించిన నయనతారను చిరు ‘ఉయ్యాలవాడ’లో హీరోయిన్‌గా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. 
 
ముగ్గురు సీనియర్ హీరోలతో నటించిన అనుభవం ఉండడం, ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయే నేర్పు ఉండడంతో నయనతారను ఈ సినిమాలో కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార ఓకే అయితే చిరంజీవితో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది.