శ్రీజ పెళ్లి హైదరాబాదులో కాదు.. జైపూర్లో.. మార్చి 28న ముహూర్తం!

Selvi| Last Updated: శనివారం, 27 ఫిబ్రవరి 2016 (15:20 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి సందడి నెలకొంది. మూడేళ్ల క్రితం రామ్ చరణ్ పెళ్లి జరిగిన తర్వాత.. ప్రస్తుతం మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ వివాహం జరుగనుంది. చిత్తూరుకు చెందిన కల్యాణ్‌తో శ్రీజ పెళ్లి జరుగనుంది. మార్చి 28న శ్రీ‌జ‌-క‌ళ్యాణ్‌ల పెళ్లి జ‌ర‌గ‌బోతుంది. ఈ వేడుక‌కు సంబంధించిన ప‌నుల‌న్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మ‌ధ్యే కూతుళ్లు, కోడలితో క‌లిసి ఫోజు ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు పెళ్లి ప‌నుల్లో బిజీ అయిపోయాడు.

తాజాగా శ్రీజ పెళ్లి హైదరాబాదులోనో, చిత్తూరులోనూ కాకుండా జైపూర్లో జరుగనుందట. జైపూర్లోని అంద‌మైన భ‌వంతిలో చిరంజీవి చిన్న కూతురు పెళ్లి ఘ‌నంగా జ‌ర‌ప‌బోతున్నారు మెగాస్టార్. ఇప్ప‌టికే మెగాస్టార్ ఇంట పెళ్లి ప‌నులు కూడా ఊపందుకున్నాయి. శ్రీ‌జ అన్న‌య్య‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, చిరంజీవిలు కూడా త‌న సినిమా పనుల్ని పక్కనబెట్టి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.దీనిపై మరింత చదవండి :