1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 మే 2016 (20:20 IST)

చిరు-కమల్ అంటే రజనీకి భయమట.. పాట, డ్యాన్స్ అంటే చొక్కా తడుస్తుందట!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్ అంటే చాలా భయమని కెమెరా మెన్ చోటా కె నాయుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సాధారణంగా పాటకు స్టెప్ వేసినా.. డైలాగ్ చెప్పినా రజనీ స్టైలే వేరు అలాంటి రజనీ కాంత్‌కి కమల్ హాసన్, చిరంజీవి అంటే ఓ విషయంలో భయమట. ఓసారి బాబా షూటింగ్ స్పాట్‌లో రజనీకాంత్‌కు బాగా చెమటలు పట్టివుంటే ఆ చొక్కా విప్పమని చోటా కె నాయుడు చెప్పారట. అందుకు కాదు.. కూడదు నేను విప్పను అంటూ సమాధానమిచ్చారట రజనీకాంత్. 
 
అయితే ఈ చొక్కా విప్పనందుకు గల కారణం ఏమిటి..? విప్పనని చెప్పినందుకు తగిన రీజన్‌ను ఫోన్ చేసి.. సారీ చెప్తూ సూపర్ స్టార్ వివరణ ఇచ్చారని చోటా కె నాయుడు అన్నారు. చిరంజీవి-కమల్ హాసన్ అసాల్ట్‌గా డ్యాన్సులు చేసేస్తుంటే.. తనకు డ్యాన్స్ రాకపోవడం.. ఎలా చేసేస్తానో అనే టెన్షన్ పడతానని రజనీ చెప్పారట. అంతేకాదు.. వాళ్ళిద్దరూ డ్యాన్స్ చించేస్తుంటే.. తనకు పాటంటే టెన్షన్ మొదలవుతుందని.. డ్యాన్స్ మాస్టర్ స్టెప్పులు చెప్పిస్తుండగా చొక్కా విప్పమని చెప్పడంతో ఆ స్టెప్పులు మరిచిపోతానని.. డ్యాన్సులు సరిగ్గా చేయలేననే ఉద్దేశంతోనే షర్టు మార్చనని రజనీకాంత్ చెప్పినట్లు చోటా కె నాయుడు చెప్పారు. 
 
సాంగ్ షూటింగ్ అంటే టెన్షన్‌లో షర్టు తడిసిపోతుందని.. షర్టు విప్పే సమయంలో స్టెప్పులు మిస్ అవుతాయనే ఉద్దేశంతోనే చోటాతో షర్టు విప్పేది లేదని ఖరాఖండిగా సూపర్ స్టార్ చెప్పినట్లు నాయుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.