శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 10 ఆగస్టు 2017 (22:01 IST)

నన్ను ఆ క్యారెక్టర్‌లోనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : 'లై' కమెడియన్ మధు(వీడియో)

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిదే సినిమాలతో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు కమెడియన్ మధు. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో ఒక వెరైటీ గెటప్‌లో కనిపించిన మధు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆడ, మగా కాని వేషంలో మధు చేసిన క్యారెక్టర్ ఆ సినిమా

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిదే సినిమాలతో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు కమెడియన్ మధు. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో ఒక వెరైటీ గెటప్‌లో కనిపించిన మధు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆడ, మగా కాని వేషంలో మధు చేసిన క్యారెక్టర్ ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆ క్యారెక్టర్ నాకు మంచి మైలేజ్ ఇచ్చిందని, ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి తాను సిద్థంగా ఉన్నానన్నారు మధు.
 
గీతాంజలి సినిమాలో నెగిటివ్ రోల్ లోనే ప్రేక్షకులు తనను ఆదరించారని, అలాగే సరైనోడు సినిమాలో కూడా కొత్త గెటప్‌తో కనిపించానని, హీరోగా తప్ప ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని ధీమా వ్యక్తం చేశారు మధు. అగ్ర కమెడియన్‌గా ఎదగాలన్న ఆశ తనలో ఎప్పుడూ లేదని, ఎప్పుడూ చేతిలో సినిమాలతో బిజీగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. తిరుపతిలో లై సినిమా మీడియా సమావేశంతో నితిన్ కన్నా కమెడియన్ మధుతోనే ఎక్కువ ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. వీడియోలో...