శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (17:31 IST)

రజనీసార్... రాజకీయాల్లోకి రండి.. భాషాతో నగ్మా సమావేశం...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఒకనాటి సినీ నటి, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా సమావేశమయ్యారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన నగ్మా.... రజనీకాంత్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కర

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఒకనాటి సినీ నటి, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా సమావేశమయ్యారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన నగ్మా.... రజనీకాంత్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నది తెలియరాలేదు.
 
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై తీవ్రస్థాయిలో మండిపడిన మరుసటి రోజే నగ్మా.. రజనీని కలవడం గమనార్హం. ఈ భేటీపై నగ్మా స్పందిస్తూ మర్యాదపూర్వకంగానే రజనీకాంత్‌ను కలిసినట్లు వెల్లడించారు. 
 
కాగా, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణించినప్పటి నుంచి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. మరోవైపు ఆయన కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నగ్మా కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.