1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మే 2024 (22:42 IST)

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

rakhi sawanth
వివాదాస్పద నటి రాఖీ సావంత్ తీవ్రమైన గుండె సమస్యతో ఆసుపత్రిలో చేరారు. టెల్లీ టాక్ పేరిట రాఖీ సావంత్‌తో క్లుప్త సంభాషణ కోసం కనెక్ట్ అయినప్పుడు, రాఖీ తనకు గుండె సమస్య ఉందని.. రాబోయే 5-6 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది.
 
రాఖీ సావంత్ గోప్యత కోసం కోరినట్లు నివేదించబడింది. మీడియా తనకు కోలుకోవడానికి సమయం ఇవ్వాలని కోరుకుంది. అయినా రాఖీ సావంత్ గుండెనొప్పికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్‌పై పడుకున్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. తాను చేరిన ఆసుపత్రి పేరు వెల్లడించేందుకు రాఖీ నిరాకరించింది. బిగ్ బాస్ షోతో రాఖీ సావంత్ మరింత పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.