మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (11:49 IST)

రోడ్లపైకి వచ్చే జనాలను చితకబాదండి : ఖాకీలకు వర్మ సూచన

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అయినప్పటికీ.. పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు పలు చోట్ల లాఠీలకు పని చెప్పాల్సివస్తోంది. మరికొన్ని చోట్ల రోడ్లపైకి వచ్చే వారికి దండాలు, నమస్కారాలు చేస్తూ రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వీటిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. పోలీసులకు ఓ విన్నపం చేశారు. 'పోలీసులకు నా విన్నపం ఏమిటంటే... జనాలతో స్నేహపూర్వకంగా ఉండకండి. వాళ్లు మీ నెత్తినెక్కి కూర్చుంటారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో జోకులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని చూస్తుంటే ఫ్రెడ్రిచ్ చెప్పిన ఒక కోట్ నాకు గుర్తుకొస్తోంది. ప్రపంచంలో ఎక్కువగా ఆందోళన చెందే జంతువు మనిషే. భయంకరమైన వాస్తవాల నుంచి ఉపశమనం పొందేందుకు బలవంతంగా నవ్వులను పుట్టించుకుంటాడు" అని వర్మ కోట్ చేశాడు.