శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (14:46 IST)

స్వీట్‌హార్ట్స్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన శివగామి

భారతీయ సినీ చరిత్రలోని పాత రికార్డులన్నీ తిరగరాసి.. సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం బాహుబలి. ఈ చిత్రంలో రాజమాత శివగామి పాత్ర మొత్తం చిత్రానికే హైలెట్. ఈ పాత్రను పోషించిన నటి రమ్యకృష్ణ. పాత్రలో ఆ

భారతీయ సినీ చరిత్రలోని పాత రికార్డులన్నీ తిరగరాసి.. సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం బాహుబలి. ఈ చిత్రంలో రాజమాత శివగామి పాత్ర మొత్తం చిత్రానికే హైలెట్. ఈ పాత్రను పోషించిన నటి రమ్యకృష్ణ. పాత్రలో ఆమె ఒదిగిపోవడమే కాకుండా చిత్రానికే రాజసం తీసుకొచ్చారు. 
 
బాహుబలిలో ప్రధానమైన శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఒకనొక సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి బహిరంగంగా కూడా చెప్పారు. 
 
అయితే, శివగామి పాత్రలో రమ్యకృష్ణను ధీర వనితగా చూపించడంలోనూ, కాలకేయుడిని అత్యంత భయంకరుడిగా ముస్తాబు చేయడంలోనూ ప్రధానంగా ఇద్దరు కనిపిస్తారు. వాళ్లే క్యాస్టూమ్ డిజైనర్స్ రమా రాజమౌళి, ప్రశాంతి. వీరిద్దరి పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
 
‘‘నా స్వీట్‌హార్ట్స్ రమగారు, ప్రశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు.’’ అంటూ ‘బాహుబలి-2’ ఆడియో రిలీజ్ సందర్భంగా రూపొందించిన వాళ్లిద్దరి ఏవీ వీడియోను రమ్యకృష్ణ షేర్ చేశారు.