శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (12:12 IST)

ధనుష్- శేఖర్‌కమ్ములతో జర్నీ ప్రారంభించిన రష్మిక మందన్న

Rashmika
కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త తెలుగు సినిమా కోసం శేఖర్ కమ్ములతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా #D51 అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో గీతగోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. 
 
ధనుష్ సరసన రష్మిక రొమాన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని టాక్. అలాగే ధనుష్, శేఖర్ కమ్ములతో రష్మిక కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. 
 
శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ధనుష్- రష్మికల మూవీ కూడా బంపర్ హిట్ అవుతుందని టాక్ వస్తోంది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితం కానుంది.