గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:36 IST)

డాన్సర్ సంధ్యారాజు చేసిన నాట్యం వ‌చ్చేస్తుంది

Dancer Sandhyaraju
`నాట్యం`అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
అలాగే ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఈ సినిమాలో తొలి సాంగ్ `నమః శివాయ‌`కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 22, న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.
 
ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.
 
న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం: స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌, నిర్మాణ సంస్థ‌: నిశ్రింక‌ళ ఫిల్మ్‌, సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌, పాటలు: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, ఆర్ట్‌: మ‌హేశ్ ఉప్పుటూరి, వి.ఎఫ్‌.ఎక్స్‌: థండ‌ర్ స్టూడియోస్‌, క‌ల‌రిస్ట్‌: ఎం.రాజురెడ్డి, ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌, సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు.