బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (15:36 IST)

ఉపాస‌న కొణిదెల ఆవిష్క‌రించిన "నాట్యం" ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌

Natyam
కూచిపూడి నృత్యం ఆధారంగా రాబోయే చిత్రం "నాట్యం". నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం ఒక మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ తెలుగు ఫీచ‌ర్ ఫిలిం త్వ‌ర‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్స్‌లో విడుద‌ల‌ కాబోతుంది. హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ కుచిపూడి డాన్సర్ సంధ్యరాజు మొద‌టిసారిగా ఒక‌ తెలుగు సినిమాలో నటించారు. ఆమె త‌న నటన, ఎక్స్‌ప్రెష‌న్స్‌, డ్యాన్స్  ద్వారా ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేయ‌నుంది. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ప‌రోప‌కారి ఉపాస‌న‌ కొణిదెల ఈ రోజు ఉద‌యం10:08 నిమిషాల‌కు`నాట్యం` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
 
ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లో సాంప్రదాయ చీర క‌ట్టుతో క్లాసికల్ డాన్సర్‌గా సంధ్యరాజు తన పాత్రలో ఒదిగిపోయారు. వెన‌క అలంకరించిన నటరాజు విగ్రహం ముందు ఆమె ఒక‌ నాట్య దేవతలా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండ‌బోతుంది అని తెలుసుకోవాల‌ని ఆసక్తిని క‌లిగిస్తోంది. ఈ మూవీ ద్వారా రేవంత్ కొరుకొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 
Natyam
 
ఈ చిత్రానికి  ర‌చ‌న‌, దర్శకత్వం వహించడంతో పాటు డిఓపి, ఎడిటర్ కూడా అత‌నే.. ఈ చిత్రం ఒక గురుశిష్యుల మధ్య ఒక అందమైన ప్రత్యేకమైన సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. అలాగే ఒక మంచి ప్రేమకథతో ముడిపడి ఉంది. క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ అంద‌మైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోని హంపి, లేపాక్షి, బెంగళూరు మరియు హైదరాబాద్ లోని అందమైన ఆర్కిటెక్ట్ దేవాలయాలలో విజువల్ బ్యూటీగా నిర్మించబడింది. 
 
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్‌, ద‌ర్శ‌క‌త్వం: రేవంత్ కొరుకొండ‌,
ప్రొడ‌క్ష‌న్ హౌస్‌: నిశ్రింకళ ఫిల్మ్స్,
సంగీతం: శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్,
లిరిక్స్‌: క‌రుణాక‌ర్ ఆదిగ‌ర్ల‌,
ఆర్ట్‌: మ‌హేష్ ఉప్పుటూరి,
 
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: స‌ంధ్య‌రాజు,
విఎఫ్ఎక్స్‌: థ‌ండ‌ర్ స్టూడియోస్‌,
క‌ల‌రిస్ట్‌: ఎమ్‌. రాజు రెడ్డి,
ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌,
సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు