ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (20:42 IST)

'ఖైదీ నం.150'లో చిరంజీవి ఇరగదీశాడ్రా.. అంటారంతా: దాసరి నారాయణ రావు

'చిరంజీవి సినిమా చూసిన తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చిరు ఇరగదీశాడు రా' అని ప్రతి ఒక్కరూ అంటారు అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఖైద

'చిరంజీవి సినిమా చూసిన తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చిరు ఇరగదీశాడు రా' అని ప్రతి ఒక్కరూ అంటారు అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. శనివారం గుంటూరులో ప్రీరిలీజ్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో దాసరి పాల్గొని మాట్లాడుతూ.. 'దాదాపు ఏనిమిది ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ నటించడం చరిత్రలో మొదటిసారి. ఎప్పుడు మేకప్‌ వేసుకుంటారా? ఎప్పుడు కథను ఫైనలైజ్‌ చేస్తారా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూసిన అభిమానులకు సమాధానం 'ఖైదీ నంబర్‌ 150'. 
 
కేవలం కృషి, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. 'ఖైదీ' కోసం ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తుంటే జనం చూస్తారా? డ్యాన్స్‌ చేస్తాడా? ఫైట్స్‌ చేస్తాడా? అనుకున్న వారందరికీ ఇదే సమాధానం. చిరంజీవి 25 ఏళ్లు కుర్రాడిగా కనిపించబోతున్నారు. అంటే ఏడాదిగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఈ సినిమా బిగినింగ్‌లో ఓ పాటను చూశా. ఆ పాట చూసిన తర్వాత నటించింది చిరంజీవా.. రామ్‌చరణా.. అల్లుఅర్జునా.. అనిపించింది. వారు కూడా సరిపోరు అంటారు మీరు. ఈ సినిమాలో ఇంట్రెవల్‌ ఫైట్‌ ఉంది. బయటకు వచ్చి తర్వాత చిరంజీవి ఇరగదీశాడు అంటారు మీరంతా. 11వ తేదీనే సంక్రాంతి వచ్చినట్టు లెక్క. ఈ చిత్రం సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వడానికి వస్తోంది. రామ్‌చరణ్‌కూ, దేవిశ్రీ ప్రసాద్‌కూ, వి.వి.వినాయక్‌కు నా అభినందనలు' అని అన్నారు.
 
అంతేకాకుండా, ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జనసముద్రం ఉంటుంది. ఎన్నాళ్లైంది ఇలాంటి జనసముద్రాన్ని చూసి అని ఆయన అన్నారు. ఒక 'ఖైదీ', 'పసివాడి ప్రాణం', 'ఘరానా మొగుడు' ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన ఫంక్షన్స్ జరిగాయని గుర్తు చేశారు.
 
ఈ చిత్రంలో తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఆయన కనిపించారని ఆయన చెప్పారు. ఈ కథ తనకు తెలుసని చెప్పారు. ఈ సినిమా కథలో అన్నీ అంశాలు ఉన్నాయని, 'ఠాగూర్'  రికార్డులు సవరించే మంచి సినిమా వస్తోందని ఆయన తెలిపారు. రైతు సమస్యలు తెలియజేసేలా ఆయన అద్భుతమైన సినిమా అని ఆయన చెప్పారు. పాటలు, ఫైట్స్, స్టోరీ బాగుందని, అభిమానులకు ఇంకేంకావాలని ఆయన అభిమానులను అడిగారు.