1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (18:55 IST)

లాంఛనంగా దక్కన్‌ ఫిలిం సొసైటీ ఏర్పాటు.. వెబ్‌సైట్ ఆరంభం.. కేసీఆర్ సమక్షంలో రిజిష్టర్!

తెలంగాణ రాష్ట్రంలో 'దక్కన్‌ ఫిలిం సొసైటీ' ఏర్పాటైంది. నబాబుకాలంలోనే హైదరాబాద్‌లో సినిమాకు అంకురార్పణ జరిగింది. ఆ సినిమా క్రమేణా.. డక్కన్‌ సినిమాగా పేరు పొందింది. అయితే.. హైదరాబాద్‌ ఓల్డ్‌సీటీ శ్లాంగ్‌తో సాగుతూ.. అక్కడి కల్చర్‌కు తగినట్లుగా సినిమాలు వుండేవి.

ఈ చిత్రాలకు పేర్లు, సెన్సార్‌ కార్యక్రమాలన్నీ ముంబై నుంచి పొందాల్సి వస్తోంది. అందుకే కొత్త రాష్ట్రం ఏర్పాడ్డాక.. కెసిఆర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో.. దక్కన్‌ ఫిలిం సొసైటీగా ఆ రంగానికి చెందిన వారు అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ లాంఛనంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో వెబ్‌సైట్‌ను ఆయన లాంఛ్‌ చేశారు. 
 
త్వరలో కెసిఆర్‌ సమక్షంలో ఘనంగా సొసైటీని రిజిష్టర్‌ చేసి డక్కన్‌ సినిమా సత్తాను చాటుతామని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. 4వేల మంది ఈ దక్కన్‌ సినిమాను నమ్ముకుని జీవిస్తున్నారని.. వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుందని గౌరవ కన్వీనర్‌ రఫీ తెలియజేశారు.

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... సినిమాలు మంచిగా తీయాలని, భాషను అపహాస్యం చేయవద్దనీ, కామెడీ వున్నా కుటుంబసభ్యులతో చూసేవిధంగా వుండాలనీ, సినిమా పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని.. హామీ ఇచ్చారు.