శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (16:57 IST)

అభిమాని కోసం దీపికా పదుకునే ఏం చేసిందో తెలుసా?

బాలీవుడ్ అందాలభామ దీపిక పదుకొనే పుట్టినరోజు. ఆమె ఎయిర్ పోర్టుకు వస్తుందని తెలుసుకున్న సదరు అభిమాని కేక్ కొన్నాడు. ఆమె కోసం రాత్రంతా ముంబయి విమానాశ్రయంలోనే గడిపాడు.

ఉదయాన్నే భర్త రణవీర్ సింగ్‌తో కలిసి లక్నో వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన దీపికకు ఈ విషయాన్ని ఫొటోగ్రాఫర్లు చెప్పడంతో ఆమె షాకైంది. అభిమాని ఆత్మీయతకు ఆశ్చర్యపోయిన దీపికా పదుకునే అభిమాని తీసుకువచ్చిన కేక్‌ను కట్ చేసి అతడి ముఖంలో వెలుగులు నింపింది.
 
మరోవైపు దీపికా పదుకునే ప్రస్తుతం ఛపాక్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వుంది. అమ్ముడు పుట్టిన రోజును పురస్కరించుకుని దీపికా పదుకునే శనివారమే ఛపాక్ టీమ్‌తో కేక్ కట్ చేసింది. జనవరి 5న పుట్టిన రోజును జరుపుకుంటున్న దీపికా పదుకునే వయస్సు 34ఏళ్లు.

పెళ్లైనా నటీమణిగా దీపికా రాణిస్తోంది. యాసిడ్ బాధితురాలిగా నటిస్తోన్న దీపికా సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజును యాసిడ్ బాధితులతో దీపికా పదుకునే గడిపింది.