శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:30 IST)

యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పదుకునే: స్టేజిపై ఏడ్చేసింది- Video

మహిళపై మృగాళ్లు చేసే అఘాయిత్యాలు ఎంత క్రూరంగా వుంటున్నాయో చూస్తున్నాం. యాసిడ్ దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతూ మహిళలను భయకంపితులను చేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనల్లో యాసిడ్ దాడికి గురయిన ఓ మహిళ యదార్థ జీవితాన్ని తీసుకుని ఛపాక్ అనే పేరుతో బాలీవుడ్ దర్శకురాలు మేఘనా గుల్జార్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పదుకునే నటించింది. 
 
2005లో ఢిల్లీలో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, గోవింద్ సింగ్ సంధు, మేఘన గుల్జార్‌తో కలిసి దీపికా పదుకునె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మంగళవారం నాడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. లక్ష్మి పాత్రలో దీపిక పదుకునె జీవించేసింది. ఈ చిత్రాన్ని 2020 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.