ముందే అన్నీ చేస్తే పెళ్లి తర్వాత మజా ఏం ఉంటుంది : దీపికా

deepika padukone - ranveer singh
ఠాగూర్| Last Updated: గురువారం, 17 అక్టోబరు 2019 (16:32 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె. ఇటీవలే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఆరేళ్లుగా ప్రేమించుకున్న వీరు.. గత యేడాది ఇటలీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరిద్దరూ గత 2013లో వచ్చిన "రామ్ లీలా" చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలోపడ్డారు.

అయితే, ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా సహజీవనం చేసే సెలెబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు మీరు కూడా సహజీవనం చేశారా? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు దీపికా పదుకొనె ఆసక్తికరమైన సమాధానమిచ్చింది.

"పెళ్లికి ముందే సహజీవనం చేస్తే... పెళ్లయిన తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించింది. ఇష్టపడ్డ వ్యక్తి గురించి ముందుగానే తెలుసుకోవాలనే కొందరు ఇలా చేస్తుంటారని... తనకు ఆ పద్ధతి ఇష్టం లేదని చెప్పింది. తామిద్దరం సరైన నిర్ణయమే తీసుకున్నామని భావిస్తున్నానని తెలిపింది. భారతీయ వివాహ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని... భార్యాభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నామని" చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :