మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 14 సెప్టెంబరు 2017 (18:40 IST)

హనీ హీరోయిన్ - సల్మాన్ హీరోగా డేరా బాబా చిత్రం ప్లాన్... కానీ...

డేరా బాబా ఆశ్రమంలోకి తనిఖీల కోసం వెళ్లిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. డేరా బాబా ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడినట్లు అనేక రుజువులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మరోవైపు పరారీలో ఉన్న డేరా బాబా పెంపుడు కుమార్తె హనీ‌ప్రీత్‌కు సంబ

డేరా బాబా ఆశ్రమంలోకి తనిఖీల కోసం వెళ్లిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. డేరా బాబా ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడినట్లు అనేక రుజువులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మరోవైపు పరారీలో ఉన్న డేరా బాబా పెంపుడు కుమార్తె హనీ‌ప్రీత్‌కు సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి. హనీకి సల్మాన్ ఖాన్ తో నటించాలని కోరిక ఉండేదట. 
 
దీనితో ఎలాగైనా సల్మాన్ ఖాన్ కాల్షీట్లు తీసుకుని ఆయన సరసన తన హనీని నటింపజేసేందుకు డేరా బాబా ఆమధ్య కొందరు బాలీవుడ్ ప్రముఖులను కూడా సంప్రదించారట. సల్మాన్ ఒప్పుకుంటే చిత్రాన్ని తీసేందుకు గాను ముంబైలోనే ఓ ఖరీదైన భవంతిని నిర్మించాడట. అన్నీ తనకు అనుకూలంగా వుండేటట్లయితే హనీ ఈసరికే సల్మాన్ ఖాన్ తో నటించేసి వుండేది. కానీ డేరా బాబా గుట్టు రట్టవడంతో సల్మాన్ పక్కన హీరోయిన్ అని డబ్బాలు కొట్టుకున్న హనీ కనిపించకూడా పారిపోయింది. కానీ గుర్మీత్ ఆశ నెరవేరలేదు.