బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 జులై 2024 (17:24 IST)

దేవ్ గిల్ పాన్ ఇండియా చిత్రం అహో! విక్రమార్క సిద్ధం

Dev punches the villain hard
Dev punches the villain hard
మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు,  ఆకర్షణీయమైన నటనతో దేవ్ కథానాయకుడిగా  దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 30న భారీ ఎత్తున తెలుగు, త‌మిళ‌, హిందీ, కన్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.  రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే హీరో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న‌ దేవ్ విల‌న్‌కు గ‌ట్టి పంచ్ ఇస్తున్నారు.
 
హీరో దేవ్ మాట్లాడుతూ ‘‘‘అహో! విక్రమార్క’తో,  పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని గొప్పగా చూపించబోతున్నాం.  సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 30 పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్ష‌కులు మ‌రో కోణాన్ని వెండితెర‌పై చూస్తారు’’ పేర్కొన్నారు.
 
దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘‘అహో! విక్రమార్క’ సినిమా పోలీసుల పవర్‌ను తెలియ‌జేసేది. సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం రూపొందించాం. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. దేవ్ ‌ను స‌రికొత్త‌గా చూస్తారు. ఆగ‌స్ట్ 30న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది’’ అన్నారు.
 
న‌టీన‌టులు:  దేవ్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు