శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 23 మే 2018 (22:22 IST)

ఎట్ట‌కేల‌కు... డైరెక్ట‌ర్ దేవ క‌ట్ట కొత్త సినిమా స్టార్ట్ చేసాడు..!

శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్‌లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్ట రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్స‌స్ సాధించ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంది. ప్రేక్ష‌కులే కాకుండా ద‌ర్శ‌కులు

శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్‌లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్ట రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్స‌స్ సాధించ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంది. ప్రేక్ష‌కులే కాకుండా ద‌ర్శ‌కులు సైతం ప్ర‌స్ధానం చిత్రాన్ని మెచ్చుకున్నారంటే... దేవ క‌ట్ట టాలెంట్ ఏమిటో అర్ధం అవుతుంది. 
 
అయితే... ప్ర‌స్ధానం త‌ర్వాత దేవ‌క‌ట్ట ఆటోన‌గ‌ర్ సూర్య తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో కెరీర్లో బాగా వెన‌క‌బ‌డిన దేవ క‌ట్ట చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు కొత్త సినిమాను మొదలుపడుతున్నారు. అది కూడ హిందీలో. తన‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన ‘ప్రస్థానం’ సినిమానే హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ జూన్ 1న ముంబైలో మొదలుకానుంది. ఇందులో స్టార్ హీరో సంజయ్ దత్, యువ హీరో అలీ ఫజల్ ప్రధాన పాత్రలు చేయనుండగా అమైరా దస్తూర్ కథానాయిక పాత్రను పోషించనుంది. మ‌రి... ఈ సినిమా అయినా దేవ‌క‌ట్ట‌కి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.