సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:25 IST)

ఐదు భాషల్లో విడుద‌లైన దెయ్యంతో సహజీవనం ట్రైలర్

నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘ (దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి లక్ష్మి, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి క్రాంతి  నిర్మించిన ఈ చిత్రం ఇదే నెలలో  విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలకు చెందిన ఈ చిత్రం ట్రైలర్ లను  ఆదివారం హైదరాబాద్ లో నట్టికుమార్ విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, హారర్, సస్పెన్స్ అంశాల సమ్మేళనంతో లేడీ ఓరియెంటెడ్  గా సాగే చిత్రమిది. మొదటిసారి హీరోయిన్ గా పరిచయమవుతున్న నాకు ఇందులో బాగా నటించడానికి అవకాశం ఉన్న రెండు విభిన్న కోణాలు  కలిగిన పాత్ర లభించడం ఆనందంగా ఉంది. నా పాత్రకు చక్కటి న్యాయంచేశానని యూనిట్ వారు అంటున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేవిధంగా చిత్రం ఉంటుంది" అని అన్నారు.
 
దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, "ఇంతవరకు నా కుమార్తె నట్టి కరుణ నిర్మాతగా కొనసాగుతూ వచ్చింది. తను నటన మీద ఆసక్తి కనబరచినపుడు న‌ట‌న‌లో అనుభవం లేదని తొలుత నేను ప్రోత్సహించలేదు. కానీ తాను పట్టుదలతో హరీష్ చంద్ర వద్ద ప్రత్యేకంగా నటనలో శిక్షణ పొంది., ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది. మా అంచనాలను ఈ చిత్రం నిలబెడుతుంది. ఒక యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని మలిచాం. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్ గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది. సెప్టెంబర్ నెలలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.
 
DSJ team
మరో హీరోయిన్ సుపుర్ణ మలాకర్ మాట్లాడుతూ, నాకు రెండు కోణాలు కలిగిన పాత్ర ఇందులో లభించింది. నా కెరీర్ మలుపుకు ఈ చిత్రం ఎంతగానో దోహదం చేస్తుంది' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ గౌతం రాజు, స్టంట్ మాస్టర్ విన్ చన్ అంజి, నటులు హరీష్ చంద్ర, తేజ, శ్రావణ్, గీత రచయిత రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో బాబూమోహన్, హేమంత్, స్నిగ్ధ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: వెంకట హనుమ నరిసెటి, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి. రమణ, నిర్మాత: నట్టి క్రాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.