గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2016 (22:35 IST)

అల్లుడుపై మామ క్లాప్‌... విఐపి 2

ధనుష్‌ తాజా చిత్రంగా 'విఐపి 2' చిత్రీకరణ మొదలైంది, గురువారం ఉదయం రజనీకాంత్‌ క్లాప్‌ కొట్టగా, ముహూర్తపు సన్నివేశాన్ని ధనుష్‌ పై చిత్రీకరించారు. ఎస్‌. థాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి, సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా యూనిట్‌కి రజనీ శుభాక

ధనుష్‌ తాజా చిత్రంగా 'విఐపి 2' చిత్రీకరణ మొదలైంది, గురువారం ఉదయం రజనీకాంత్‌ క్లాప్‌ కొట్టగా, ముహూర్తపు సన్నివేశాన్ని ధనుష్‌ పై చిత్రీకరించారు. ఎస్‌. థాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి, సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా యూనిట్‌కి రజనీ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
రజనీ స్వయంగా వచ్చి ఆశీస్సులు అందజేయడం పట్ల, ధనుష్‌ ట్విట్టర్‌ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ''ఇంతకన్నా ఏం కోరుకోగలను? మీ అందరి ఆశీస్సులతో 'విఐపి2' చిత్రీకరణ మొదలైందని' ట్వీట్‌ చేశాడు. గతంలో వచ్చిన 'విఐపి'కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 'రఘువరన్‌ బీటెక్‌' పేరుతో తెలుగులోను ఆ సినిమా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.