గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (10:11 IST)

నా దూకుడుకు తగ్గ 'సరైనోడు' దొరికాడు.. అలియా భట్

అమిత దూకుడు ఉన్న బాలీవుడ్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఈమె త్వరలోనే రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకోనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఈ వార్తలపై ఆమె ఇప్పటివరకు పెదవి విప్పలేదు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం తనకు సరైనోడు దొరికాడంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'అవును నాకు "సరైనోడు" దొరికాడు. నాపట్ల అభిమానం, ప్రేమ ఉన్నవాడు.. మరీ ముఖ్యంగా అందమైన వ్యక్తి. నటీనటుల జీవితాలు చాలా వర్ణాతీతంగా ఉంటాయి. ఏదైనా ఒక సినిమాలో నటించిన తర్వాత మేమెప్పుడూ నిక్కచ్చి తీర్పునే కోరుకుంటాం. ఆ తీర్పు ప్రభావం నా మీద కూడా ఉంటుంది. దర్శకులు చెప్పినట్లే కెమెరాల ముందు సినిమాల్లో నటిస్తాను కానీ ఎన్నడూ రియల్‌లైఫ్‌లో నటించను. ఆ అవసరం నాకు రాలేదు' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. 
 
కాగా.. ఆలియా భట్, రణబీర్ కపూర్ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. అంతేకాదు ఈ జంట కెమెరా కంట సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఈ జంట 2020లో పెళ్లి పీఠలెక్కబోతున్నట్లు బాలీవుడ్‌లో ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా ఆలియా ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి రణబీరా కాదా అన్నది తెలియాలంటే ఈమె పెళ్లి పీఠలెక్కేవరకు వేచి చూడాల్సిందే మరి.