సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జులై 2023 (16:05 IST)

విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ సినిమా కోసం లొకేషన్ వేటలో దిల్ రాజు

Dil Raju his team at us location
Dil Raju his team at us location
విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి సినిమా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రెండో సినిమాను ఈ మధ్యే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
 
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించబోతోన్నట్టుగా తెలుస్తోంది.
 
తాజాగా ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ఫోటోను వదిలింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దిల్ రాజు, పరుశురామ్ ఇతర సాంకేతిక నిపుణులు లొకేషన్ల వేటను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.
 
 శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఈ చిత్రం. ఇక త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
 
తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
డీ ఓ పి : KU మోహనన్, సంగీతం : గోపీసుందర్, ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ, నిర్మాతలు : రాజు - శిరీష్, రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల