1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:57 IST)

షారుక్ - కాజోల్ కిస్సింగ్... ఎగబడి చూస్తున్నారట...

హాలీవుడ్‌ను బాలీవుడ్‌ బాగా అనుకరిస్తోంది. అందుకే ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాల్లో లిప్‌లాక్‌లు వుంటున్నాయని కొందరంటున్నారు. దీనికోసం ప్రత్యేకమైన హీరో కూడా వున్నారు. ఇదిలా వుండగా.. షారుఖ్‌ ఖాన్‌ కాజోల్‌ దిల్‌ వాలే దుల్హానియా లే జాయేంగే, కుచ్‌ కుచ్‌ హోతా హై వంటి బ్లాక్‌‌బస్టర్‌ మూవీస్‌‌లో నటించిన ఈ జంట. ఇప్పుడు కిస్సింగ్‌ సీన్లు వున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
 
చాలాకాలం తర్వాత 'దిల్‌ వాలే' అనే సినిమాలో జంటగా కన్పించారు. ఇది ఆడకపోయినా.. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని తెలిసింది. అయితే ఈ సినిమా మేకింగ్‌ వీడియో పేరుతో కొన్ని సీన్లు బయటికి వదిలింది ఈ టీమ్‌. ఐతే ఆ వీడియోల్లో ఒకదాంట్లో షారుక్ ఖాన్‌ కాజోల్‌‌కు ముద్దు పెట్టడం జనాల్లో ఆసక్తి రేపుతోంది. సినిమాల్లో ముద్దుల కంటే ఈ ముద్దు మీద జనాలు తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. వీటికి సోషల్‌ మీడియాలో మంచి క్లిక్స్‌ వస్తున్నాయట.