శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 18 డిశెంబరు 2019 (23:02 IST)

చైత‌న్య‌లో నిజాయితీ లేక‌పోతే ఇలా జ‌రిగేది కాదు - డైరెక్ట‌ర్ బాబీ

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ. ఈ సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ బాబీ స్పందిస్తూ... ఈ స‌క్సెస్ రెండేళ్ల క‌ష్ట‌మిది. ఓ డైరెక్ట‌ర్ క‌ల‌ను 24 శాఖ‌లు క‌లిపి చేస్తేనే సినిమా. అన్ని సినిమాల‌కు అంద‌రూ క‌ష్ట‌ప‌డ‌తారు. కానీ.. కొన్ని సినిమాలు మాత్ర‌మే స‌క్స‌స్ అవుతాయి. స‌క్సెస్‌ను ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ అన్నారు.
 
నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెష‌ల్‌. ఈ సినిమా చేయ‌డానికి ఎంత సంతోష‌ప‌డ్డానో అంతే టెన్ష‌న్ ప‌డ్డాను. ఎందుకంటే.. నిజ‌మైన మామ‌, అల్లుడితో చేసే సినిమా. వెంక‌టేశ్ గారు, చైత‌న్య గారి పాజిటివిటీ వ‌ల్లే ఈ సినిమా తీయ‌గ‌లిగాను. నేను చేసింది మూడు సినిమాలే. వెంక‌టేష్ గారి ముందు నేనేమీ లేదు. ఓ హీరోగా వ‌ర్కింగ్ స్టైల్లో, ఎక్స్‌పీరియెన్స్‌లో గుర్తుపెట్టుకుంటే ఆయ‌నే ముందుంటారు. 
 
చైత‌న్య‌లో నిజాయ‌తీ లేక‌పోతే, ఈ సినిమా ఇంత స‌క్సెస్ అయ్యేది కాదు. త‌ను క‌థ‌ను న‌మ్మాడు. మావ‌య్య‌ల‌ను న‌మ్మాడు. అదే ఈ రిజ‌ల్ట్‌. చిరంజీవి గారు ఓ ఆడియెన్‌లా ఎంజాయ్ చేశారు. సినిమాలోని స‌న్నివేశాల గురించి ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అలాగే మ‌హేష్ గారు కూడా సినిమాను చూసి ట్వీట్ చేశారు. వారికి థ్యాంక్స్‌. ప్ర‌సాద్ మూరెళ్ల గారికి రెండేళ్లు ముందు ఈ క‌థ‌ను చెప్పాను. 
 
ఆయ‌న నేను ఊహించిన దాని కంటే గొప్ప‌గా చూపించారు. వివేక్ గారు, సురేష్ గారు ఇచ్చిన న‌మ్మ‌కాన్ని మ‌ర‌చిపోలేను. త‌మ‌న్‌తో ప‌వ‌ర్ సినిమా చేశాను. ఇప్పుడు మ‌రో సినిమా చేశాను. ఐదుసార్లు నా కోసం రీరికార్డింగ్ చేశాడు. విశ్వ‌ప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. రాశీఖ‌న్నా, పాయ‌ల్ కేవ‌లం హీరోయిన్స్‌గానే కాదు.. స‌న్నివేశాల‌ను అద్భుతంగా డ్రైవ్ చేశారు. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని గెలిపించారు. మంచి విజ‌యాన్ని అందించారు అంటూ వెంకీమామ స‌క్స‌స్ గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను ఈవిధంగా బ‌య‌ట‌పెట్టారు డైరెక్ట‌ర్ బాబీ.