వెంకీ మామ ఎంతవరకు వచ్చాడు..?
విక్టరీ వెంకటేష్, యువ సమ్రాట్ నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ వెంకీ మామ. ఈ సినిమాకి జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వెంకీ, చైతులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు. రియల్ లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతు రీల్ లైఫ్‌లో కూడా అవే పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఈ సినిమాకి ప్రేక్షకాభిమానులు చాలా అంచనాలతో వస్తారు.
అయితే... ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా.. ఆ అంచనాలను అందుకునేలా డైరెక్టర్ బాబీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఇప్పటివరకు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.