డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ తాజా చిత్రం ప్రకటన
Sekhar Kammula, sunil narang, dhanush
తాజాగా ప్రొడక్షన్ హౌస్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. నాగ చైతన్య, సాయి పల్లవితో క్లాసిక్ 'లవ్ స్టోరీ', ప్రస్తుతం జరుగుతున్న #DNS తర్వాత, ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ SVCLLP తో శేఖర్ కమ్ముల థర్డ్ కొలాబరేషన్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు.
ఈ కొత్త చిత్రం లార్జర్ దెన్ లైఫ్ గా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శేఖర్ కమ్ముల, SVCLLP హ్యాట్రిక్ మూవీ హై బడ్జెట్, టాప్-క్లాస్ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందనుంది.
ప్రస్తుతం జరుగుతున్న #DNS పూర్తయిన తర్వాత ఇది ఫ్లోర్స్ పైకి వెళ్తుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
