కరోనా కుమార్‌తో శంకర్ కుమార్తె జోడీ?
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఊపిరి ఫేమ్ కార్తితో ఓ సినిమాతో తమిళ తెరకు పరిచయం కానున్న శంకర్ కుమార్తె అదితి.. మరో ఆఫర్ కొట్టేసింది. కార్తీ సినిమా సెట్స్ పై ఉండగానే అదితి మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
'కరోనా కుమార్' అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ఆమె శింబు జోడీగా సందడి చేయనుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి గోకుల్ దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం శింబు .. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తి కాగానే 'కరోనా కుమార్' సెట్స్ పైకి వెళ్లనుంది.