గురువారం, 17 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (16:58 IST)

తమిళ సినిమాలు చూడటం మానేశా: డైరక్టర్ సుకుమార్‌

నేను ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలను చూస్తారని అంటారు. అన్ని భాషల చిత్రాలను చూస్తాను. కొన్నాళ్ళుపాటు తమిళ చిత్రాలు చూసేవాడిని.. అయితే 8 సంవత్సరాలుగా తమిళ సినిమాలు చూడటమే మానేశాను అని దర్శకుడు సుకుమార్ అన

నేను ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలను చూస్తారని అంటారు. అన్ని భాషల చిత్రాలను చూస్తాను. కొన్నాళ్ళుపాటు తమిళ చిత్రాలు చూసేవాడిని.. అయితే 8 సంవత్సరాలుగా తమిళ సినిమాలు చూడటమే మానేశాను అని దర్శకుడు సుకుమార్ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నప్పుడు తమిళ సినిమాలు చూడటం మొదలు పెట్టాను. అప్పుడు నేను చూసిన సినిమా మైనా (తెలుగులో ప్రేమఖైదీ). సినిమా నాకెంతో నచ్చింది. మణిరత్నం సినిమాల సన్నివేశాలు ఒక పంథాలో సాగుతాయి. అలాంటి పంథాలో సినిమాలు తీసే దర్శకుడు ప్రభుసాల్మన్‌. ఇప్పుడు మన సినిమాలు కూడా హాలీవుడ్‌ రేంజ్‌లో వస్తున్నాయి. అలాగే 'రైల్‌' సినిమా హాలీవుడ్‌ రేంజ్‌ ఉంటుందని భావిస్తున్నా. ప్రభు అద్భుతంగా తెరకెక్కించాడు. కీర్తిసురేష్‌, ధనుష్‌ రైలు జర్నీ అద్భుతంగా వచ్చిందని.. దర్శకుడు సుకుమార్‌ అన్నాడు. 
 
ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం అందించారు. పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడారు. రైలు జర్నీ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం. అలాంటి వారికిఈ సినిమా నచ్చుతుందని తెలిపారు. 
 
చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్‌ మాట్లాడుతూ... ధనుష్‌, కీర్తిసురేష్‌ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. రిస్కీ సన్నివేశాల్లో చక్కగా నటించారు. ఢిల్లీ నుండి హైదరాబాద్‌ వరకు జరిగే రైలు ప్రయాణమే ఈ చిత్ర కథనం. సినిమా రీరికార్డింగ్‌ చాలా బావుంటుంది. తెలుగు సినిమాను తప్పకుండా చేస్తాను అన్నారు.