గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (17:04 IST)

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

Director Teja  launched Police Vaari hechharika title logo
Director Teja launched Police Vaari hechharika title logo
అభ్యుదయ  దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో  తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న  పోలీస్ వారి హెచ్చరిక  సినిమా  టైటిల్, లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్ డైరెక్టర్  తేజ మంగళవారం రోజున  ఆయన కార్యాలయం లో ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా  దర్శకుడు తేజ మాట్లాడుతూ, ఏ సినిమా కైన  ప్రేక్షకులను ఆకర్షించేది , వారిని థియేటర్ ల వద్దకు  నడిచేలా చేసేది  టైటిల్ మాత్రమే, ఈ  పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా  అలాంటి శక్తివంతమైన  మాస్  టైటిల్ అని, ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారం గా మారి విజయాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
 
విజయాలను  సెంటిమెంట్ గా  మలుచుకున్న  సక్సెస్ ఫుల్  దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం  మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని , దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని   నిర్మాత  బెల్లి జనార్థన్
పేర్కొన్నారు.
 
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. మా సినిమా  షూటింగ్  రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు.
 
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్, షియాజీ షిండే, హిమజ, జయవాహినీ, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత, గోవింద, హనుమ, బాబురాం తదితరులు ఈ చిత్ర తారాగణం.