మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

డిజైరబుల్ ఉమెన్ జాబితాలో అగ్రస్థానంలో 'లోఫర్' బ్యూటీ

ప్రముఖ పత్రిక టైమ్స్ తాజాగా టాప్ - 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో దిశా పటానీ అగ్రస్థానంలో నిలిచింది. గ‌త ఏడాది ఈ భామ ఇదే జాబితాలో 9వ ర్యాంక్‌లో ఉండగా, ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడం విశేషం.
 
ఈ 'లోఫర్' బ్యూటీ తొలి స్థానాన్ని దక్కించుకోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవ‌ల బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేయ‌డం, మంచి స‌క్సెస్‌ల‌ను సాధించ‌డంతో దిశా ఈ రికార్డ్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. గ‌త ఏడాది 9వ ర్యాంక్ సాధించిన దిశా ప‌టానీ ఈ ఏడాది టాప్ ర్యాంకుకి చేరుకోవ‌డం విశేషం.
 
ఇదే జాబితాలో రెండో స్థానంలో సుమన్ రావ్, మూడో స్థానంలో కత్రినా కైఫ్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దీపికా పదుకునె, వర్తికా సింగ్, కైరా అద్వానీ, శ్రద్ధా కపూర్,  యామీ గౌతమ్, అదితీ రావు హైదరీ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్  ఉన్నారు. దక్షిణ భారత హీరోయిన్లకు ఇందులో చోటు లభించలేదు.
 
కాగా, ఇటీవలే టైమ్స్‌ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేయగా అందులో షాహిద్ కపూర్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో రణవీర్ సింగ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు.
 
అయితే గ‌త ఏడాది టాప్ ప్లేస్ ద‌క్కించుకున్న అలియా ఈ సారి నెపోటిజం వ‌ల‌న 12 వ స్థానంకు పడిపోయింది. కాగా. మోస్ట్ డిజైరబుల్ మెన్  జాబితాలో నెం.1 గా షాహిద్ కపూర్ నెం.2 రణవీర్ సింగ్ నెం.3 స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచిన విషయం తెలిసిందే.