శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (18:50 IST)

బుట్టబొమ్మకు 300 మిలియన్ వ్యూస్ క్రాస్.. అల వైకుంఠపురంలో అదిరే రికార్డులు (video)

అల వైకుంఠపురంలో సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలన్నీ బంపర్ హిట్ అయ్యాయి. ఇందులో బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రలో బుట్టబొమ్మ సాంగ్ 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. 
 
అలాగే రాములో రాములో పాటతో పాట, సామజవరగమన పాట కూడా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది. తాజాగా ఈ సినిమాలోని మ్యూజిక్ ఆడియో ఆల్బమ్ మరో రికార్డు దక్కించుకుందని తమన్ ట్వీట్ చేశాడు.
 
ఇకపోతే.. అల వైకుంఠపురములో సినిమా విషయానికొస్తే.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. 
 
ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఇప్పటికే ఈ సినిమాలోని అన్ని పాటలు కలిసి 1 బిలియన్ వ్యూస్ రాబట్టినట్టు యూట్యూబ్ తెలిపింది. మొత్తంగా ఒక సినిమాలోని పాటల ఆల్బమ్ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్స్ అన్ని కలిసి 100 కోట్ల వ్యూస్‌ను రాబట్టడం తెలుగులో ఇదే తొలిసారి కావడం గమనార్హం.