గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Modified: బుధవారం, 3 జనవరి 2018 (15:08 IST)

కోహ్లీ, మహేష్‌ బాబు త్రాగే నీరు అంత రేటా..?

ప్రస్తుతం కోహ్లీ, మహేష్‍ ‌బాబు ఇద్దరూ వారివారి రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. పైగా అందంలో వీరికి పోటీపడే వారే కరువయ్యారు. ఇప్పటికే 40 యేళ్లు పైబడిన మహేష్, తన నటన, అందంతో అమ్మాయిల కలల రాకుమారుడుగా వెలుగొందుతున్నాడు. మరోపక్క విరాట్ కోహ్లీ భారత

ప్రస్తుతం కోహ్లీ, మహేష్‍ ‌బాబు ఇద్దరూ వారివారి రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. పైగా అందంలో వీరికి పోటీపడే వారే కరువయ్యారు. ఇప్పటికే 40 యేళ్లు పైబడిన మహేష్, తన నటన, అందంతో అమ్మాయిల కలల రాకుమారుడుగా వెలుగొందుతున్నాడు. మరోపక్క విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గానే కాక అద్భుతమైన బ్యాట్స్‌మేన్‌గా కొనసాగుతున్నాడు. వీరిద్దరికీ సంబంధించిన ఒక విషయం వింటే ఔరా అనకుండా ఉండలేరేమో.
 
అదే వారు త్రాగే వాటర్ బాటిల్ ధర. సాధారణంగా మనకు అందుబాటులో ఉండే వాటర్ బాటిల్ ధర 15 నుండి 20 రూపాయలు ఉంటుంది. కానీ వీరు ఉపయోగించే వాటర్ బాటిల్ ధర లీటర్ 600 రూపాయలకు పైమాటే. అందులోనూ అది ఎవీయన్ బ్రాండ్ అయ్యుండాలి. ఇది ఫ్రాన్స్‌ నుండి దిగుమతి చేసుకుంటారు. వారు ఎక్కడైనా ఫంక్షన్‌లకు వెళ్లినప్పుడు లేదా హోటళ్లలో బస చేసినప్పుడు ఈ వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉండాల్సిందే. 
 
ఈవిధంగా వారు వాటర్‌ బాటిళ్లపై నెలకు 35 వేల నుండి 40 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ నీరుని త్రాగడం వలన వారి అందం రెట్టింపు అవ్వడంతో పాటు యవ్వనంగా కనిపిస్తున్నారని నెటిజన్‌లు చెవులు కొరుక్కుంటున్నారు.