శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జులై 2024 (17:45 IST)

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

Shivani Rajasekhar
Shivani Rajasekhar
హీరో డా. రాజశేఖర్ తనయురాలుగా శివానీ, శివాత్మిక తెలుగు సినిమా రంగంలోకి వచ్చాయి. కోటబొమ్మాళి తో శివానీ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. జీవితా రాజశేఖర్ ల నటవారసురాళ్ళుగా ఇద్దరూ సినిమారంగంలోకి వచ్చారు.  మొదట్లో నిర్మాణ రంగంలో వున్నారు. ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు సినిమాలు నిర్మించడంలో వారి అంచనాలు బాగున్నాయని తల్లిదండ్రులు కితాబుఇచ్చారు. జులై 1 న శివానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కొత్త లుక్ ను విడుదలచేసింది.
 
తెలుగులో కంటే తమిళంలో ముందుగా నటించిన శివానీ 2 స్టేట్స్ అనే సినిమాలో మొదటి అడుగు వేసింది. జీవిత పెద్ద కుమార్తెగా ఆమె ఆ సినిమాలో కొంత భాగం షూట్ చేశారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా కొంత భాగం షూట్ అయ్యాక సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత తమిళంలో నటించింది. వెబ్ సిరీస్ లో నటించిన అద్భుతం బాగా పేరు తెచ్చిపెట్టింది.
 
మరో వెబ్ సిరీస్ విద్యావాసుల అహం కూడా పేరు తెచ్చినా సినిమాల్లో ఎందుకనే పెద్దగా అవకాశాలు రాలేకపోతున్నాయి. ఇటీవలే కొందరు తెలుగు అమ్మాయిలు కథానాయికలుగా వస్తున్నారు. ఆ కోవలో శివానీ మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం.