శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (11:11 IST)

ప్లీజ్... నా కెరీర్‌ను నాశనం చేయొద్దు : యువ హీరో తనీశ్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్న యువహీరో తనీశ్ మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదనీ, కేవలం మద్యం, సిగరెట్ మాత్రమే తాగుతానని అన్నారు. అంద

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్న యువహీరో తనీశ్ మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదనీ, కేవలం మద్యం, సిగరెట్ మాత్రమే తాగుతానని అన్నారు. అందువల్ల తన కెరీర్‌ను నాశనం చేయొద్దని తనీష్ ప్రాధేయపడ్డాడు. 
 
డ్రగ్స్ కేసులో సోమవారం సిట్ విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడాడు. డ్రగ్స్ కేసులో తన పేరు వెలుగులోకి రావడంతో తాను చాలా బాధపడ్డానని, కుటుంబ సభ్యులు కూడా ఆవేదనలో మునిగిపోయారని తెలిపాడు. తాను ఇప్పుడిప్పుడే సినీ రంగంలో ఎదుగుతున్నానని, తనను ఇరికించి తన కెరీర్‌ను దెబ్బతీయ వద్దని కోరాడు. 
 
డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరు తెస్తారో తనకు తెలియదని, తానెవరికీ ఇవ్వలేదని, ఎవరి నుంచీ తీసుకోలేదన్నారు. అంతేకాదు, డ్రగ్స్‌ను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నాడు. ‘సే నో టు డ్రగ్స్’కు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సి ఉందన్నాడు.