శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (15:52 IST)

డ్రగ్స్ కేసు: ఈడి విచారణకు రకుల్ రాలేదట..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడి విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ దూరం అయ్యేలా కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. 
 
ఈడి జారీ చేసిన నోటీసులు ప్రకారం సెప్టెంబర్ 6న విచారణ రకుల్ ప్రీత్ సింగ్ హాజరు కావాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈడి విచారణకు హాజరు కాలేనంటు ఈడి అధికారులను కోరింది రకుల్ ప్రీత్ సింగ్.
 
ఈడి విచారణ కు తాను హాజరు అయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని ఈడి అధికారులను కోరింది రకుల్ ప్రీత్ సింగ్. అటు ఎక్సైజ్ అధికారుల విచారణలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేకున్నా.. డ్రగ్స్ కేసుతో పలు లింక్‍‌లు ఉన్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది ఈడి.
 
అయితే రకుల్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి పై ఈడి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఇవాళ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణకు హాజరు అయిన సంగతి తెలిసిందే.